HomeTelugu Trendingబాలయ్య-బోయపాటి టైటిల్‌ ఫిక్స్‌!

బాలయ్య-బోయపాటి టైటిల్‌ ఫిక్స్‌!

Title has been fixed for B
నందమూరి బాలకృష్ణ – బోయ‌పాటి శీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ‘బీబీ3’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఇక ఈ సినిమాలో బాల‌య్య అఘోరా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ మూవీకి ‘గాడ్ ఫాద‌ర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

బాల‌య్య ఇమేజ్‌కు, క‌థ‌కు గాడ్ ఫాద‌ర్ అనే 7టైటిల్ అయితేనే స‌రిగ్గా సరిపోతుంద‌ని భావించిన మేక‌ర్స్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్, వీడియోలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రం మే 28న ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu