
Prabhas Prashanth Varma Movie Title:
ప్రభాస్ అభిమానులకు శుభవార్త! ఇటీవల హను-మాన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘Baka’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ మరియు అనౌన్స్‌మెంట్ వీడియో ఇటీవల హను-మాన్ స్టూడియోలో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వచ్చే నెలలో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది.
‘Baka’ అనే టైటిల్ మిథలాజికల్ కథ ఆధారంగా తెరకెక్కుతుందని సమాచారం. ప్రధానంగా పౌరాణిక విలన్ పాత్ర అయిన బకాసురుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్‌తో పాటు నెగటివ్ టచ్ ఉన్న ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే KGF, సలార్, కాంతార లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించింది.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మరియు ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అంతేకాదు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘Spirit’, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందనున్న ‘Kalki 2’, అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘Salaar 2’ వంటి భారీ సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి.
‘Baka’ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్‌లలో ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సిందే. అయితే, ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.