HomeTelugu Big Storiesయూ- ట్యూబర్ తో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌

యూ- ట్యూబర్ తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌

Titu talks with rrr movie t

యూ- ట్యూబర్ భువన్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల భువన్ ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళితో చిన్న పాటి చిట్ చాట్ నిర్వహించాడు. విశేషం ఏమంటే ‘గ్రాండ్ గా లీడ్ తీసుకుని’ ఇదంతా రజనీకాంత్ కు సంబంధించింది అంటూ తేల్చేశాడు. ఇక రాజమౌళి, ఎన్టీయార్, చరణ్‌ తనదైన శైలిలో ఆడుకున్నాడు. ఎన్టీయార్ నటించిన ‘శక్తి’ సినిమా తనకి బాగా ఇష్టమైందంటూ అందులోని డైలాగ్స్ చెప్పాడు.

‘శక్తి’ తప్పితే మరే సినిమా నువ్వు చూడలేదా? దాన్ని మర్చిపో అని చివరకు ఎన్టీయార్ ప్రాధేయపడేలా చేశాడు. ఆ సమయంలో ముసిముసిగా నవ్వుకున్న రామ్ చరణ్‌ నూ భువన్ వదిలిపెట్టలేదు. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘జంజీర్’ మూవీ మీదా సెటైర్ వేశాడు. థియేటర్ లో ఆడియెన్స్ లేకపోవడంతో బిందాస్ గా ఎంజాయ్ చేస్తూ చూశానని చెప్పాడు. రాజమౌళిని ‘మాన్ స్టర్’ అని ఎందుకు ఎన్టీయార్ సంబోధిస్తారో చెప్పమని ఒత్తిడి చేశాడు. డెవిల్ అయిన ఎన్టీయార్ కు ఎదుటి వ్యక్తి మాన్ స్టర్ గా కనిపించడంలో తప్పులేదని రాజమౌళి కవర్ చేశాడు. రాజమౌళిని ‘రాజా’ అని సంబోధిస్తూ, ‘కింగ్ ఆఫ్‌ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ అని కితాబిచ్చాడు. ఇక ఆయన తీసిన ‘బాహుబలి’ సినిమాతో తాను భార్యతో పడుతున్న కష్టాన్ని చెప్పుకుని ఘొల్లు మన్నాడు.

ప్రభాస్ భుజాన శివలింగాన్ని పెట్టుకుని మోసినట్టు మూడో అంతస్తుకు గ్యాస్ సిలిండర్ మోయమని భార్య పోరుపెడుతోందని వాపోయాడు. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తీస్తున్న సమయంలో తాను హీరోల ఇమేజ్ ను పట్టించుకోలేదని, కేవలం వారి క్యారెక్టర్లకు న్యాయం చేయడానికే కృషి చేశానని రాజమౌళి తెలిపాడు. లెగసీ అనేది ఎప్పటికీ బరువు కాదని, దాని ద్వారా డిసిప్లీన్ వస్తుందని రామ్ చరణ్‌ చెప్పగా, సినిమాలు పరాజయం పాలైనప్పుడు ఆ లెగసీలోని గొప్పతనాన్ని తాను అర్థం చేసుకున్నానని ఎన్టీయార్ తెలిపాడు. చివరగా అలియా భట్ తో ఒక్కసారి ఫోన్ లో మాట్లాడించమని ఈ టీమ్ ను కోరగానే.. ‘మేం మేనేజర్ల మాదిరిగా కనిపిస్తున్నామా’ అంటూ వారంత ఇంటర్వ్యూ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాదాపు 14 నిమిషాల పాటు సాగిన ఈ ఫన్నీ ఇంటర్వూ సరదాగా సాగింది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను జనవరి 7 గా పేర్కొనకుండా… దానిని మార్చి ఉంటే బాగుండేది! దాంతో ఇది ఎప్పుడో రికార్డ్ చేసి ఇప్పుడు స్ట్రీమింగ్ చేసినట్టు తెలిసిపోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu