రాధిక- శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష

ప్రముఖ సినీ జంట రాధిక, శరత్‌కుమార్‌లకు చెక్‌ బౌన్స్‌ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. ఈ దంపతులకు జైలు శిక్ష విధిస్తూ చెన్నై స్పెషల్‌ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. శరత్‌కుమార్‌, రాధిక, లిస్టిన్‌ స్టీఫెన్‌ సంయుక్తంగా గతంలో సినిమాలు నిర్మించేవాళ్లు. ఈ క్రమంలోనే రేడియన్స్‌ మీడియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నారు. అప్పు చెల్లించేందుకు 2017లో రేడియన్స్‌ సంస్థకు చెక్‌ అందజేయగా.. అది బౌన్స్‌ అయ్యింది. దీంతో రేడియన్స్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆ కేసును విచారించిన కోర్టు రాధిక దంపతులకు జైలు శిక్ష వేస్తున్నట్లు తీర్పునిచ్చింది. రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

CLICK HERE!! For the aha Latest Updates