HomeTelugu Trendingఈ హీరోయిన్‌ ని గుర్తు పట్టారా?

ఈ హీరోయిన్‌ ని గుర్తు పట్టారా?

2 15ఈ ఫొటోలోని హీరోయిన్‌ను గుర్తుపట్టారా?.. ఎత్తుపళ్లు, చేతిలో పిజ్జాతో కాస్త విచిత్రంగా ఉన్న ఈమె ఎవరో కాదండీ. ‘హార్ట్‌ ఎటాక్‌’ చిత్రంతో కుర్రకారు మనసులు దోచిన నటి అదా శర్మ. ఈ భామ ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.’ అని ట్వీట్‌ చేశారు. అయితే అక్కడ ఉన్నది ఆమేనని అభిమానులు గుర్తు పట్టేశారు. ‘నువ్వు ఎంత మేకప్‌ వేసినా మేం గుర్తు పట్టగలం, నువ్వే..’ అంటూ కామెంట్లు చేశారు. మరి అదా ఈ లుక్‌లో ఎందుకు తయారయ్యారో చెప్పలేదు.

‘క్షణం’ తర్వాత అదా తెలుగులో ‘కల్కి’ చిత్రంలో నటించారు. రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్నఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అదా ‘కమాండో 3’, ‘బైపాస్‌ రోడ్‌’ అనే హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. దీంతోపాటు వెబ్‌ సిరీస్‌లోనూ సందడి చేస్తున్నారు. మొదటిసారి ‘ది హాలిడే’ అనే సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ ఇటీవల విడుదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!