‘టాలీవుడ్ తండర్స్’ బాడ్మింటన్ లీగ్!

సినీ తారలతో ఇప్పటివరకు క్రికెట్ లీగ్ లను నిర్వహించారు. ఇప్పుడు మొదటిసారిగా బాడ్మింటన్
లీగ్ ను నిర్వహిస్తున్నారు హేమచంద్రన్ (ఫౌండర్ అండ్ సి.ఇ.ఓ ఆఫ్ సెలబ్రిటీ బాడ్మింటన్ లీగ్).
ఈ టీం కు కెప్టెన్ గా హీరో సుధీర్ బాబు వ్యవహరిస్తుండగా.. మంచు లక్ష్మి టీం మోటివేటర్ గా
వ్యవహరించనున్నారు. అలానే హీరో నాగచైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు నిరహించనున్నారు.
ఇటీవలే ఈ బాడ్మింటన్ లీగ్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో
మంచు లక్ష్మి, సుధీర్ బాబు, తరుణ్, ఛార్మి, సంజనా గల్రాని, తేజస్వి మదివాడ వంటి సెలెబ్రిటీలతో
పాటు సెలెబ్రిటీ బాడ్మింటన్ లీగ్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సెలెబ్రిటీ బాడ్మింటన్ లీగ్
కోలీవుడ్, మాలీవుడ్, సాండల్ వుడ్, టాలీవుడ్ ఇలా నాలుగు ఇండస్ట్రీలకు ప్రాతినిధ్యం వహించబోతోంది.
ముందుగా అక్టోబర్ 22న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీల
సమక్షంలో బాడ్మింటన్ లీగ్ ను నిర్వహించనున్నారు. ఫైనల్స్ ను మలేషియాలో కౌలాలంపూర్
ప్రాంతంలో నిర్వహించనున్నట్లు హేమచంద్రన్ తెలిపారు. విజేతలుగా నిలిచిన వారికి 25, 15,10
లక్షల చొప్పున నగదు బహుమతిని అందించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates