HomeTelugu Newsభారీ బడ్జెట్‌ మూవీలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కీలక పాత్ర?

భారీ బడ్జెట్‌ మూవీలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కీలక పాత్ర?

Tollywood Young Hero in Ram

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘రామాయణం’. ఈ సినిమా ప్రకటించిన అప్పటి నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించి నటీనటు, ఇతర ఏ అప్డేట్‌ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఈక్రమంలో ఈమూవీ నటీనటులు గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీరాముడిగా హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఫిక్స్‌ అయిన్నట్లు తెలుస్తుంది. హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అమితాబ్ బచ్చన్, ఓ కీలక పాత్రల కోసం రకుల్ ప్రీత్ సింగ్‍ల పేరును కూడా మూవీ టీమ్ ఆలోచిస్తోందని టాక్‌.

తాజాగా రామాణయణంలో ఎంతో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మూవీ టీమ్ చర్చలు జరుపుతోందని టాక్‌. అతడు ఈ పాత్రకు సూటవుతారని దర్శకుడు నితేశ్ తివారీ భావిస్తున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్‌ ప్రేక్షకులకు నవీన్‌ పోలిశెట్టి సుపరిచితమే. పలు హీందీ సీరియళ్లలో నవీన్‌ నటించాడు. 2019లో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘చిచోరేలో’ నవీన్ పోలిశెట్టి కీలకపాత్ర చేశాడు. ఈ సినిమాలో అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. చిచోరే చిత్రానికి దర్శకత్వం వహించింది నితేశ్ తివారీనే. ఈ పరిచయంతోనే రామాయణంలో లక్ష్మణుడి పాత్ర ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తుంది.

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నవీన్ ఆ తరువాత ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!