
Traitors by Karan Johar:
బిగ్ బాస్, రోడియస్, స్ప్లిట్స్‌విల్లా లాంటి రియాలిటీ షోలు ఎప్పుడూ టీవీలో హిట్టే. ఒకవైపు వీటిని విమర్శించే వారు ఉన్నా, మరోవైపు మదిలోంచి తీసేయలేని వ్యసనంగా మారాయి. ఇప్పుడు అదే రేంజ్‌లో ఓటీటీలోకి మరో క్రేజీ షో వస్తోంది. “ది ట్రైటర్స్” అనే ఈ షోను కరణ్ జోహర్ హోస్ట్ చేయబోతున్నారు.
ఈ షో జూన్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి రానుంది. మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వారిలో కొందరు పేర్లు ఇలా ఉన్నాయి – కరణ్ కుంద్రా, ఊర్ఫీ జావేద్, రాఫ్తార్, లక్ష్మీ మంచు, పూరవ్ ఝా, హర్ష్ గుజ్రాల్, అపూర్వా, అన్షులా కపూర్, రాజ్ కుంద్రా, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్ ఇంకా చాలామంది.
ఈ షోలో మూడు మంది ట్రైటర్స్ (ద్రోహులు) రహస్యంగా మిగతావారిని ఒక్కొక్కరిని ఆట నుంచి తొలగిస్తారు. మిగిలిన కంటెస్టెంట్లు ఆ ట్రైటర్స్‌ను గుర్తించి వాళ్లను ఎలిమినేట్ చేయాలి. ఇది కొంతవరకు Among Us గేమ్ లా అనిపించొచ్చు.
ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా, దీనిపై రియాక్షన్స్ మిక్స్ అయ్యాయి. కొంతమంది “వావ్! క్రేజీ షో.. కూల్ కాస్టింగ్!” అని పొగడ్తలతో ముంచెత్తగా, ఇంకొంతమంది “ఇది బిగ్ బాస్, రోడియస్, Among Us మిక్స్ లా ఉంది… పీక్ క్రింజ్ షో!” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
కాని చివరికి ఈ రియాలిటీ షో కూడా గిల్టీ ప్లెజర్గా మారే అవకాశం ఉంది. చూసి తీరాలి అనిపించేలా చేస్తున్నది కాబట్టి, ఇది ఓటీటీలో బిగ్ బాస్ 2.0 అయి ఉంటే ఆశ్చర్యం లేదు!
ALSO READ: సినిమాకి 25 కోట్లు అని AR Rahman నే దాటేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..













