HomeTelugu TrendingTripti Dimri: ఆమె నాజీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది

Tripti Dimri: ఆమె నాజీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది

Tripti Dimri praises on Bollywood actress:

Tripti Dimri praises on Bollywood actress: సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’లో నటించిన త్రిప్తి డిమ్రీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో బోల్డ్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో రణ్‌వీర్‌- త్రిప్తి కెమిస్ట్రీకి ఫ్యాన్స్‌ సైతం ఫిదా అయ్యారు. దీంతో యానిమల్ తర్వాత ఈ అమ్మడుకి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.

ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు మూవీల్లో నటిస్తుంది. ఈక్రమంలో.. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమెలా ఉండడం చాలా గొప్ప అంటూ ప్రశంసలు కురిపించింది.

Tripti Dimri

త్రిప్తి మాట్లాడుతూ..’ మరో దేశానికి వెళ్లి కెరీర్‌ ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి. ప్రియాంకకు ధైర్యంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ ఎక్కువే. హాలీవుడ్‌కు వెళ్లి సక్సెస్‌ను సాధించింది. ఆమె నాలాంటి వారికి స్ఫూర్తి. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ప్రియాంక మూవీ బర్ఫీ మొదటిసారి చూసినప్పుడు ఆమెను గుర్తుపట్టలేదు.

యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా మనం కనిపించకూడదు. కేవలం మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్రతోనే మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని అన్నారు. ప్రియాంక తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని త్రిప్తి కొనియాడారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu