HomeTelugu Newsతొలిసారి ఖాకీడ్రెస్‌లో కనిపించనున్న త్రిష

తొలిసారి ఖాకీడ్రెస్‌లో కనిపించనున్న త్రిష

Police role for trisha
‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ త్రిష కృష్ణన్. ఆ తర్వాత ప్రభాస్ ‘వర్షం’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా ఉన్నారు త్రిష. వరుసగా ‘వర్షం’, ‘నువ్వస్తానంటే నేనోదంటానా’, ‘అతడు’ లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం త్రిష.. ప్రియమణి ప్రధాన పాత్రల్లో కుట్రపయిరిచి అనే తమిళ చిత్రం సెట్స్ పైకి వెళ్తోంది. యంగ్ హీరోయిన్ సురభి.. సుబ్బరాయలు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ ఇందులో త్రిష పాత్ర గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. 17 ఏళ్ళ కెరీర్ లో తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో త్రిష ఓ సీక్రెట్ ఏజెంట్ (డిటెక్టివ్)గా కనిపిస్తుందా? లేక నేరుగా పోలీస్ గా కనిపిస్తుందా..? అన్నది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu