
Identity OTT release date:
టోవినో థామస్, త్రిషా కృష్ణన్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలలో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ “ఐడెంటిటీ” ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు తెలుగు వెర్షన్‌తో థియేటర్లలో విడుదలై మంచి క్రేజ్ సంపాదించింది.
ఇప్పుడు విషయం ఏమిటంటే, “ఐడెంటిటీ” సినిమా OTTలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. జనవరి 31, 2025న ZEE5లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా ప్రీమియర్ కానుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత నెల లోపే ఈ సినిమా OTTలో అందుబాటులోకి రావడం విశేషం.
ఈ సినిమాలో టోవినో థామస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, త్రిషా కృష్ణన్, వినయ్ రాయ్ తమ అద్భుత నటనతో ప్రేక్షకులని మెప్పించారు. మంధిరా బేడీ, షమ్మీ తిలకన్, అజు వర్గీస్, అర్జున్ రాధాకృష్ణన్, అర్చన కవి వంటి మంచి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బీజాయ్ సంగీతం అందించారు, ఇది సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచింది.
సెంటరీ ఫిల్మ్స్, రాగం మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఆకట్టుకునే కథతో, ఆకర్షణీయమైన విజువల్స్‌తో థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్ మూమెంట్స్ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.
ఐడెంటిటీ సినిమాని మీ ఇంటి కంఫర్ట్‌లో చూడాలనుకుంటే, జనవరి 31న ZEE5ని మిస్ కాకండి. ఇది అన్ని భాషలలో విడుదల కానుండటంతో, సౌత్ ఇండియన్ ప్రేక్షకులందరికీ రీచ్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.