HomeTelugu Trendingత్రిష 'యానిమల్‌' రివ్యూ.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

త్రిష ‘యానిమల్‌’ రివ్యూ.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Trisha review on Animal

హీరోయిన్‌ త్రిష కృష్ణన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవలి చిత్రం లియో విజయం సంద‌ర్భంగా వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో లైమ్ లైట్ లో క‌నిపించింది. ఇంత‌లోనే లియో కోస్టార్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన అవ‌మాన‌క‌ర‌ వ్యాఖ్యలు ఆమెను ఇబ్బంది పెట్టాయి. తాజాగా యానిమల్ చిత్రంపై త్రిష‌ ఇచ్చిన రివ్యూ కారణంగా మరోసారి ఆమె హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది.

గత రాత్రి రణబీర్ కపూర్ చిత్రం ‘యానిమల్’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సోష‌ల్ మీడియాలో వ‌న్ లైన‌ర్ స‌మీక్ష చేస్తూ “ఒక మాట – CULT! Pppppppaaaaaahhhhhh” అని వ్యాఖ్య‌ను జోడించింది. ఈ పోస్ట్ చాలా మంది నెటిజనుల్లో అగ్గి రాజేసింది. త్రిష‌ సమీక్షపై వారు అభ్యంతరం వ్యక్తం చేసేలా చేసింది. కొద్దిరోజుల క్రితమే త్రిష‌ మహిళల గౌరవం గురించి మాట్లాడారని, ఇప్పుడు మహిళలను ప్రతికూలంగా చూపించిన సినిమాను ప్రశంసించారని కొందరు విమర్శిస్తున్నారు.

కొందరు త్రిష‌ను ‘నకిలీ ఫెమినిస్ట్’ అంటూ మండిపడుతున్నారు. మరికొందరు మీమ్స్‌తో ట్రోల్ చేశారు. ఈ త‌ర‌హా ఎదురు దాడిని ఊహించ‌ని త్రిష తక్షణమే ఆ పోస్ట్ ని తొలగించింది. అయితే సంబంధిత సమీక్ష స్క్రీన్‌షాట్‌లు ఇంటర్నెట్‌లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. వృత్తిపరంగా చూస్తే.. మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ లో త్రిష న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది. ఇప్పుడు విడాముయార్చి – థగ్ లైఫ్ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో న‌టిస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu