HomeTelugu Trendingరకుల్‌ సోదరుడు మూవీ నుండి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

రకుల్‌ సోదరుడు మూవీ నుండి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

Trishanku movie first lyric

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ సోద‌రుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘త్రిశంకు’. ప్రాచి తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సుమ‌న్‌, మహేష్ ఆచంట, నవీన రెడ్డి ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లిరికల్ సాంగ్‌ని స్టార్‌ హీరో రానా దగ్గబాటి విడుదల చేశాడు. ‘ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా’ అంటూ సాగే ఈ పాటకి భాష్యశ్రీ లిరిక్స్‌ అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. సునీల్ క‌శ్య‌ప్ చక్కటి సంగీతం అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu