బోయపాటి తగ్గే ప్రసక్తే లేదు!

సరైనోడు సినిమాతో బోయపాటి రేంజ్ మరింత పెరిగింది. స్టార్ హీరోలు అతనితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ బోయపాటి మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ఒప్పుకొని ఆశ్చర్య పరిచాడు. నిజానికి బోయపాటి, బెల్లంకొండ సురేష్ తో సినిమా చేస్తానని ఇచ్చిన మాట కారణంగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బోయపాటికి ముట్టజెప్పింది అక్షరాల 15 కోట్ల రూపాయలు. నిజానికి లెజెండ్ సినిమా తరువాత బోయపాటికి 10 కోట్ల పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడ్డారు నిర్మాతలు.

కానీ బెల్లంకొండ మాత్రం 13 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే ఆయన అనుకున్నదానికంటే ఎక్కువగానే నిర్మాత అందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే బోయపాటి 13 కోట్లకు ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ సినిమా అటు ఇటు అయినా.. ఆ ఎఫెక్ట్ మాత్రం బోయపాటిపై పడే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు పెద్ద హీరోలు బోయపాటితో చేయడానికి సిద్ధంగా ఉన్నారు.