16 ఎంపీలు గెలిచి కీలక పాత్ర పోషిస్తాం..

ఢిల్లీలో ఇతర టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ కవిత… పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్రం మంత్రులను కలుస్తామని… రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు .. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 52 అంశాల అమలుకు కృషి చేస్తామన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ తదితర పార్టీలను ప్రజలను మోసం చేయాలని చూశాయని.. కానీ, ప్రజల ముందు అవేవీ పనిచేయలేదు… పనిచేసే ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు మళ్లీ పట్టం కట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మొదట ఈవీఎంలు గోల్ మాల్ అన్నారు.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపును ఈ కామెంట్ ప్రభావితం చేస్తుందని భావించి ఇప్పుడు చంద్రబాబును తిడుతున్నారని ఎద్దేవా చేశారు కవిత. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని సెటైర్లు వేసిన కవిత… విజయంతో తాము పొంగిపోకుండా మరింత బాధ్యతతో పనిచేస్తామన్నారు.