HomeTelugu Big Storiesనితిన్‌ 'చెక్' ట్రైలర్‌

నితిన్‌ ‘చెక్’ ట్రైలర్‌

Nithin Check Movie Offici
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెక్’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వ వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా ‘చెక్’ ట్రైలర్ విడుదల చేసింది. ఉరిశిక్ష పడిన ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్‌ రకుల్‌. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మురళీశర్మ, సంపత్ రాజ్, సిమ్రాన్ చౌదరి, హర్ష వర్ధన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu