HomeTelugu Big Storiesషూటింగ్‌లకు బై చెప్పిన టాప్‌ యాంకర్లు..

షూటింగ్‌లకు బై చెప్పిన టాప్‌ యాంకర్లు..

telugu top anchors sensatioబాలీవుడ్‌ అమితాబ్ బచ్చన్‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు అందరూ ‘కోవిడ్’ బారిన పడ్డారు. మొదటి నుంచి కరోనా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ చెబుతూ వచ్చినా.. అమితాబ్‌ ని కరోనా కాటు వేయడంతో మిగతా ఆర్టిస్టుల్లో కరోనా భయం పట్టుకుంది. ఇక బిగ్‌ బీ.. కౌన్ బనేగా కరోడ్ పతి షో కోసం చేసిన ఆడిషన్స్ ‌లో పాల్గొనడం వల్లే ఆయనకు కరోనా వచ్చిందనే వార్తలు ఇపుడు టెలివిజన్ ఇండస్ట్రీని భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలు టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు సీరియల్స్‌కు కొంత కాలం విరామం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ స్టార్‌ హీరోలు.. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. వీళ్లు మాత్రం కోవిడ్‌కు మందు వచ్చిన తర్వాత కానీ షూటింగ్స్‌లో పాల్గొనబోమని తెగేసి చెప్పినట్టు సమాచారం.

ఇక టాలీవుడ్ టాప్ యాంకర్స్ అయిన సుమ, అనసూయ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమ, అనసూయ కూడా షూటింగులు వద్దు బాబోయ్ అంటున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు మరికొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉండాలని వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీవీ పరిశ్రమలో పలువురు నటీ, నటులుకు కరోనా బరిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు షూటింగ్స్ గట్రా చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీళ్ల బాటలోనే చాలా మంది యాంకర్స్‌తో పాటు ప్రోగ్రామ్ నిర్వాహకులు సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu