HomeTelugu Big Storiesచంద్రయాన్‌-2: చివరి నిమిషంలో అవాంతరం

చంద్రయాన్‌-2: చివరి నిమిషంలో అవాంతరం

1 5భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. దేశం అంతా ఉత్కంఠగా చూసిన చంద్రయాన్ 2 ప్రయోగంలో చివరి క్షణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో తెలిపింది. శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ప్రధాని మోడీ అభినందించారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని, దేశమంతా శాస్త్రవేత్తల వెంట ఉంటుందన్నారు. ధైర్యంతో మరిన్ని ప్రయోగాలను ఇస్రో కొనసాగించాలని ప్రధాని ఆకాంక్షించారు. ముందు వరకు ప్రయోగం విజయవంతంగా సాగింది. చంద్రుని కక్ష్య నుంచి ల్యాండర్‌ వేగాన్ని శాస్త్రవేత్తలు నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చారు.

కక్ష్యనుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి దిశగా సాగుతుండటంతో మొదట శాస్త్రవేత్తల్లో ఆనందం నెలకొంది. 15 మినిట్స్ ఆఫ్‌ టెర్రర్‌లో అధిక భాగం విజయవంతగానే సాగింది. దీంతో ప్రయోగం సక్సెస్ అవుతుందనే శాస్త్రవేత్తలు దీమాగా కనిపించారు. ఒంటి గంట 53 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుందని ఇస్రో అధికారులు ప్రకటించారు. అయితే అంతలోనే ల్యాండర్‌తో ఇస్రోకు సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రధానికి ఇస్రో ఛైర్మన్ వివరించారు.

చివరి క్షణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని, చంద్రయాన్ 2 విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాన్ని ప్రధాని అభినందించారు. ఇకపై మరింత ధైర్యంగా అంతరిక్ష ప్రయోగాలు చేయాలని దేశం యావత్తు శాస్త్రవేత్తల వెంట ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విద్యార్థులతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని వీక్షించారు.

ఆ తర్వాత కాసేపు విద్యార్థులతోనూ మోడీ ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధనమిచ్చారు. ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్ నిలిచిపోవడంతో… అసలేం జరిగి ఉంటుందని ఇస్రో విశ్లేషిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని ఇస్రో అధికారులు ప్రకటించారు. చంద్రుడిపై జరిగే ప్రయోగాల్లో సక్సెస్‌ రేట్ 30 శాతమేనంటున్నారు నిపుణులు. ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినంత మాత్రాన నిరాశ చెందవద్దని త్వరలోనే డేటా సిగ్నల్స్ అందవచ్చేమోనని ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. దేశప్రజలంతా ప్రస్తుతం శాస్త్రవేత్తలకు అండగా నిలవాలంటున్నారు. అంతరిక్షంలో జరిగే మార్పులే ల్యాండర్‌తో ఇస్రో కోల్పోవడానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రుడిపై జరిగే వాతావరణ మార్పులవల్లే ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu