HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ బర్తడే పార్టీలో ఆ ఇద్దరూ మిస్స్‌!

రామ్‌ చరణ్‌ బర్తడే పార్టీలో ఆ ఇద్దరూ మిస్స్‌!

two star heroes missed in R

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిన్న పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న రాత్రి రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక చాలా గ్రాండ్ గా జరిగాయి. చిరంజీవి కొత్తింట్లో ప్రత్యేకంగా ఆహ్వనింపబడ్డ అతిథుల మధ్య వేడుకలు జరిగాయి. రామ్‌ చరణ్‌ ‘ఆస్కార్‌’ అందుకున్న తరువాత మొదట సెలబ్రెట్‌ చేసుకుంటున్న బర్త్‌డే ఇది. అందుకే ఈ వేడుకలను చాలా ప్రత్యేకంగా నిర్వహించారు. ఆస్కార్ గెలిచిన సందర్భంగా ఈ బృందాన్ని చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు.

ఈ పార్టీకి నాగార్జున, అమలతో పాటు అఖిల్, నాగచైతన్య కలిసి వచ్చారు. దగ్గుబాటి ఫ్యామిలీ వెంకటేష్, రానాలు కూడా హైలైట్‌ గా నిలిచారు. కాజల్ అగర్వాల్ జంట, కొత్త జంట మంచు మనోజ్ జోడితో పాటు లక్ష్మి ప్రసన్న కూడా సందడి చేశారు. ప్రముఖ దర్శక నిర్మాతలందరూ కూడా కనిపించారు. రాజమౌళి కుటుంబం, ఎస్ఎస్ కార్తికేయ, కాలభైరవలతో పాటు ఎంఎం కీరవాణి శ్రీమతితో కలిసి వచ్చారు.

ram charan

అడవి శేష్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, డివివి దానయ్య, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగుంజ్, ప్రశాంత్ నీల్, నర్తన్, బి గోపాల్, కెఎస్ రామారావు, అశ్వినీదత్, కోదండరామిరెడ్డి, మైత్రి నవీన్-రవి, బివిఎస్ఎన్ ప్రసాద్, దిల్ రాజు, ఎన్వి ప్రసాద్ ఇలా పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. డిన్నర్ కూడా అక్కడే ఏర్పాట్లు చేశారు. అయితే ఇద్దరూ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ కారణంగా ఆయన హాజరుకాలేదు. అల్లు అర్జున్ వస్తాడేమో అని అనుకుంటున్న క్రమంలో..కేవలం అల్లు అరవింద్ మాత్రమే దర్శనమిచ్చారు. అయితే బన్నీ కూడా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 ప్రెజర్ మాములుగా లేదు. కానీ డైరెక్టర్‌ సుకుమార్ వచ్చినప్పుడు బన్నీ ఫ్రీనే కదా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. బన్నీ ఒక్క ట్వీట్ చేయకపోవడం చర్చకు దారి తీసింది. మొత్తానికి తారక్ బన్నీలు లేకపోవడంతో వాళ్ళ ఫ్యాన్స్‌ని అప్‌సెట్‌ అయ్యారనే చెప్పాలి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu