మహేష్ సినిమా టైటిల్స్ విన్నారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తరువాత మహేష్ తన 25వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కృష్ణ ముకుందా మురారి’,’హరే రామ హరే కృష్ణ’ వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ రెండు టైటిల్స్ లో ఒకటిని ఫైనల్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు భామల పేర్లు వినిపిస్తున్నప్పటికీ మహేష్ మాత్రం రకుల్ ను హీరోయిన్ గా రిఫర్
చేశారని చెబుతున్నారు. మరి ఫైనల్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి!