HomeTelugu Trending'అన్ స్టాపబుల్2' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

‘అన్ స్టాపబుల్2’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

Unstoppable 2 Update
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. సీజన్-1 తో హిట్‌ కావడంతో సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 4న ట్రైలర్ అంటూ విడుదల చేసిన పోస్టర్ లో బాలయ్య ను బ్యాక్ నుండి చూపించారు.

ఇప్పటికే సీజన్ 2 కోసం ఒక థీమ్ సాంగ్ ను చిత్రీకరించారు. అంతే కాకుండా ఈనెల 4వ తారీకున మొదటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేయబోతున్నారు. మొదటి సీజన్ ను మించి రెండవ సీజన్ ఉండేలా ఆహా టీమ్ ప్లాన్ చేశారట. మొదటి ఎపిసోడ్ కు బాలయ్య తో చంద్రబాబు మరియు లోకేష్ లు సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట. అనుష్క, సమంతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి కూడా చివరి ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu