HomeTelugu Trendingబాలయ్యతో రాజమౌళి.. 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' ప్రోమో

బాలయ్యతో రాజమౌళి.. ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ ప్రోమో

Unstoppable Ep 5 Promo

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహారిస్తున్న ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’. తాజాగా ఈ షోకు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రాజమౌళిని బాలకృష్ణ పలు ప్రశ్నలు అడిగారు. ‘మీరు ఇంటెలిజెంట్‌ అని, అఛీవర్‌ అని తెలుసు. ఇంకా ఎందుకు ఆ గడ్డం’, ‘మీతో సినిమా చేస్తే.. హీరోకు, ఇండస్ట్రీకి హిట్‌ ఇస్తారు. ఆ తర్వాత ఆ హీరోల రెండు, మూడు సినిమాలు ఫసక్‌యేగా’ అని ప్రశ్నించగా, రాజమౌళి కేవలం హావభావాలు మాత్రమే పలికించారు. ‘సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి’ అని బాలయ్య అడగ్గా, ‘మీకూ తెలుసు, నాకూ తెలుసు ఇది ప్రోమోఅని, సమాధానాలు ఎపిసోడ్‌లో చెబుతా’ అని రాజమౌళి చెప్పటం నవ్వులు పూయిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu