HomeTelugu Trending‘అన్‌స్టాపబుల్‌’ ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రోమో

‘అన్‌స్టాపబుల్‌’ ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రోమో

Unstoppable episode 1 promo

నందమూరి బాలకృష్ణ. తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’వేదికగా నవంబర్‌ 4 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్‌’ మొదటి ఎపిసోడ్‌ ప్రోమోను ‘ఆహా’ విడుదల చేసింది. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు అతిథిగా సాగిన ఈ ఎపిసోడ్‌లో బాలయ్య తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. కెరీర్‌లో చూసిన ఎత్తుపల్లాలతోపాటు ఎన్నో వ్యక్తిగత, రాజకీయ విషయాలపై మోహన్‌బాబు తన అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

ఇందులో భాగంగా ఓ రౌండ్‌లో ‘‘మీరు నటించిన చిత్రాల్లో అస్సలు చూసుకోలేని చిత్రమేది?’’ అని బాలకృష్ణ ప్రశ్నించగా.. ‘‘పటాలం పాండు’’ అని మోహన్‌బాబు సమాధానం చెప్పగానే.. ‘‘సినిమా ఫ్లాప్‌ అయ్యిందా’’ అంటూ బాలయ్య నవ్వులు పూయించారు. ‘‘హీరోగా నిలబడాలనే ప్రయత్నం విఫలమవుతున్న రోజుల్లో మీరు ఎప్పుడైనా బాధపడ్డారా?’’ అని బాలయ్య ప్రశ్నించడంతో.. మోహన్‌బాబు ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ షోలో మంచు లక్ష్మి, విష్ణు సైతం సరదాగా సందడి చేశారు. బాలయ్యతో కలిసి ఆడిపాడారు. ఈ ఫుల్‌ ఎనర్జిటిక్‌, ఎంటర్‌టైనింగ్‌ ఎపిసోడ్‌ చూడాలంటే దీపావళి వరకూ వేచి ఉండాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu