HomeTelugu Trendingఅన్‌స్టాపబుల్‌: మూడో సీజన్‌ గెస్ట్‌లు వీరే!

అన్‌స్టాపబుల్‌: మూడో సీజన్‌ గెస్ట్‌లు వీరే!

unstoppable with nbk 3 upda

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓటీటీ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా మూడో సీజన్‌కి రెడీ అయింది. ఈక్రమంలో గెస్టులను ఆహా ఓటీటీ రివీల్ చేసింది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే మూడో సీజన్‌ లో శ్రియ శరణ్, సుహాసిని మణిరత్నం, జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ రానుండటం విశేషం. ఈ ఎపిసోడ్ గెస్ట్‌ల లిస్ట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పటి టాప్ హీరోయిన్లు, కనుమరుగైపోయిన ఓ డైరెక్టర్, మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తున్న మరో డైరెక్టర్.. ఇలా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే మూడో ఎపిసోడ్ లో గెస్టులు అయోమయానికి గురి చేస్తున్నారు.

unstoppable with 1

ఈ గెస్ట్‌లను బుధవారం (డిసెంబర్ 13) తమ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా ఆహా రివీల్ చేసింది. మొదట ఆ గెస్టులెవరో చెప్పుకోండి చూద్దాం అని సవాలు విసిరిన షో మేకర్స్.. తర్వాత ఆ నలుగురిని రివీల్ చేశారు. “మిస్టరీ రివీల్ అయిపోయింది.

ఇప్పుడీ స్టార్స్ తో అన్‌స్టాపబుల్ సరదాకి మీరు రెడీనా? అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే త్వరలోనే ఆహాలో రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ ఎపిసోడ్ ప్రోమోను పోస్ట్ చేసింది. ఇందులో బాలయ్య కేవలం గెస్టులకు వెల్‌కమ్ చెబుతున్న వీడియో మాత్రమే ఉంది. వాళ్లతో ఎలాంటి టాక్స్ జరిగాయి? ఈ ఎపిసోడ్ ఎలా సాగిందన్నది ఇంకా రివీల్ చేయలేదు.

https://www.instagram.com/reel/C0ynYKCJKWZ/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu