‘బాహుబలి’ సీరియల్ గా రానుంది!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’. భారీ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వచ్చే ఏడాది ‘బాహుబలి2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొదటి సినిమాను మించి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం.అయితే ఇప్పుడు ఈ సినిమా మరో సంచలనానికి సిద్ధమవుతోంది. బాహుబలి కథను సీరియల్ రూపంలో తీసుకురానున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అయితే సినిమాలో
పాత్రల పరిధులను పెంచి రాయాలి గనుక దానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.

అయితే ఇది సీరియల్స్ మాదిరి డైలీ సీరియల్ కాదు.. వెబ్ సిరీస్ మాదిరి 10 నుండి 12 ఎపిసోడ్స్ లో కథ పూర్తవుతుంది. కొంత గ్యాప్ తరువాత అదే పాత్రలతో మరో కథ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ విధంగా సీరియల్ రన్ అవనుంది.