దర్శకుడిపై ఎన్టీఆర్ ఒత్తిడి!

‘జైలవకుశ’ సినిమా షూటింగ్ మొదట నిదానంగా చేసుకుంటూ వెళ్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు సెప్టెంబర్ 1న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ దర్శకుడు బాబీపై ప్రెషర్ పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా తన అన్నయ్య కల్యాణ్ రామ్ బ్యానర్ లో చేస్తున్నాడు. ఈ సినిమాతో కల్యాణ్ కు పెద్ద హిట్ అందించాలనేది ఎన్టీఆర్ ప్లాన్. దీంతో సెప్టెంబర్ 1న రిలీజ్ టార్గెట్ చేశారు. అయితే ఇప్పటికి పూర్తయిన సూటింగ్, ఇకపై పూర్తి చేయాల్సిన షూటింగ్ మొత్తం చూసుకుంటే అనుకున్న డేట్ కు సినిమాను విడుదల చేయడం కష్టం.
కానీ ఎట్టిపరిస్థితుల్లో సినిమా సెప్టెంబర్ 1న విడుదల చేయాలని అప్పటికి అన్ని పనులు పూర్తవ్వాల్సిందేనని ఎన్టీఆర్ దర్శకుడు బాబీకి డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. దసరా నాటికి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ కావడంతో వాటి మధ్య తన సినిమాను కూడా విడుదల చేసి ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. ఎన్టీఆర్ సెప్టెంబర్ 1న వస్తే మూడు వారాల పాటు సినిమాకు ఎలాంటి అడ్డంకి లేకుండా రన్ చేసుకోవచ్చని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. దీంతో సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది. ఒకవేళ ఆలస్యమవుతుందని అనిపిస్తే.. రెండు యూనిట్స్ తో రెండేసి షిఫ్టులు ప్లాన్ చేయబోతున్నారు.