HomeTelugu Big Stories'అన్ స్టాపబుల్' చివరి ఎపిసోడ్‌లో మహేష్‌ బాబు సందడి

‘అన్ స్టాపబుల్’ చివరి ఎపిసోడ్‌లో మహేష్‌ బాబు సందడి

Unstoppable With Nbk season
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’ సీజన్-1 ముగిసిపోతోంది. ఈ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు. వరుసగా మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, బోయపాటి శ్రీను అఖండ టీమ్, దర్శక ధీరుడు రాజమౌళి లతో 5 ఎపిసోడ్లు అలరించిన బాలయ్య 6 వ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో సందడి చేయనుండగా.. 7 వ ఎపిసోడ్ లో మాస్ మహారాజ రవితేజతో రచ్చ చేశాడు. ఇప్పటకే ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బాలయ్య సందడి చేయనున్నారు. సీజన్ ఫినాలే సూపర్ స్టార్ తో నట సింహం బాలకృష్ణ అంటూ ఆహా పోస్టర్ రిలీజ్ చేసింది. ‘రాసి పెట్టుకోండి.. నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ల సందడి కనువిందు చేయనుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న అల్లు అర్జున్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా.. నూతన సంవంత్సరం కానుకగా డిసెంబర్ 31 న రవితేజ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూడు ఎపిసోడ్ల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu