HomeTelugu Trendingభారత పౌరురాలిగా మా అమ్మకు విలువ లేదా.. ఉపాసన ఆగ్రహం

భారత పౌరురాలిగా మా అమ్మకు విలువ లేదా.. ఉపాసన ఆగ్రహం

6 11అపోలో ఆస్పత్రుల వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభన కామినేని ఓటు మాయమవడంపై ఆమె కుమార్తె ఉపాసన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన శోభన ఓటు వేయడానికి హైదరాబాద్‌ చేరుకున్నారు. కానీ జాబితాలో ఆమె పేరు గల్లంతైనట్లు గుర్తించడంతో ఆవేశానికి గురయ్యారు. దీని గురించి ఉపాసన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘మా అమ్మ ఈరోజు తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయింది. పది రోజుల క్రితం చూసుకున్నప్పుడు ఓటర్ల జాబితాలో తన పేరుంది. కానీ ఇప్పుడు గల్లంతైంది. అమ్మ కూడా పన్ను కడుతోంది. అలాంటప్పుడు ఆమె లెక్కలోకి రాదా? భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా?’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ఇది నా జీవితంలోనే వరస్ట్‌ రోజు. నేను భారత్‌కు వచ్చిందే నా బాధ్యతను నిర్వర్తించడం కోసం. తీరా పోలింగ్‌ బూత్‌కు రాగానే ఓటు గల్లంతైందని అంటున్నారు. నాకు ఈ దేశంలో విలువ లేదా? నా ఓటు ముఖ్యం కాదా? ఓ పౌరురాలిగా ఇది నాపై జరిగిన నేరంగా భావిస్తున్నాను. నేను దీనిని సహించలేను’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు శోభన. చిరంజీవి కుటుంబీకులతో పాటు ఉపాసన కూడా ఈరోజు ఉదయం తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu