HomeTelugu Newsబ్రో: బాలీవుడ్‌ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌!

బ్రో: బాలీవుడ్‌ బ్యూటీ ఐటమ్‌ సాంగ్‌!

Urvashi Rautela Item Song i

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కల్యాణ్, సాయితేజ్ కలిసున్న పోస్టర్‌‌ చిత్రంపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇటీవలే సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేసిన చిత్ర బృందం ఈ వారంలో ఐటమ్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే ఈ ఐటమ్‌ సాంగ్‌లో పవన్, సాయితేజ్‌ తో పాటు ఎవరూ చిందేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ బఊర్వశి రౌతేలా పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలు టాలీవుడ్‌ సినిమాలు.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌ లో స్పెషల్ సాంగ్స్‌తో నర్తించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దాంతో, ఐటమ్ సాంగ్స్‌ లో ఆమెకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ‘బ్రో’ నుంచి కూడా ఆమెకు ఆఫర్ వెళ్లగా వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఊర్వశి పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఖుషి’ సినిమా చూసింది. ఈ విషయాన్ని ఆదివారం స్వయంగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ లెక్కన ‘బ్రో’ ప్రత్యేక గీతానికి ఊర్వశి రెడీ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకు సంబంధించి పబ్‌ సెట్‌ను సిద్ధం చేశారని, దీనికి గణేశ్‌ మాస్టర్, భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu