భీష్మ డైరెక్టర్‌తో వైష్ణవ్‌ తేజ్‌!

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఉప్పెన’. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, హీరోగా వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ఆయన రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పగా… కరోనా ఉధృతి తగ్గగానే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఆ సినిమాలతో పాటు మరో సినిమా చేయడానికి కూడా వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు వెంకీ కుడుముల. అవును .. ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయడానికి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. నితిన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ఒక సినిమాను వెంకీ కుడుముల ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్న సమయానికి ‘గని’ పూర్తికాకపోవడం వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. వరుణ్ తేజ్ సినిమా పూర్తయ్యేలోగా, వైష్ణవ్ తేజ్ తో చేయడానికి వెంకీ కుడుముల రంగంలోకి దిగాడట. వైష్ణవ్ తేజ్ కి కథ నచ్చడంతో, త్వరలోనే వీరు సెట్స్ పైకి వెళుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates