HomeTelugu Trendingఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వైష్ణవ్‌ తేజ్‌ స్పీచ్

ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వైష్ణవ్‌ తేజ్‌ స్పీచ్

Vaishnav tej speech in upp
మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న (శనివారం0 హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. హీరో వైష్ణవ్ తేజ్ తొలి స్పీచ్‌తోనే ఆకట్టుకున్నాడు. మేనమామ ముందు మైక్ పట్టుకుని మంచి బేస్ వాయిస్‌తో స్పీచ్‌ ఇచ్చి అలరించాడు మెగా మేనల్లుడు.

ఆయన అమ్మ గురించి మాట్లాడుతూ.. నువ్వు మా కోసం చేసిన త్యాగాలకు థాంక్స్ అమ్మా.. నువ్వు లేకపోతే మేం లేము. మా ముగ్గురు మావయ్యలు.. మెగాస్టార్ చిరంజీవిగారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారూ, నాగేంద్రబాబు మావయ్య వీళ్లు ముగ్గురూ లేకపోతే మేం లేము. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతుండేవారు. జీవితాంతం రుణపడి ఉంటాం మా మామయ్యలకు. నన్ను సొంత కొడుకుగా చూసుకున్నారు అన్నారు. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ‘ఉప్పెన’ సినిమాకి హీరో నేను కాదు.. ఈ సినిమా కథే హీరో.. ఇలాంటి కథకు నన్ను హీరోగా పెట్టినందుకు చాలా థాంక్స్. నాకు తొలి సినిమా కావడంతో చాలా టిప్స్ చెప్పారు. ఈ సినిమా ఉప్పాడలో తీశాం.. అక్కడ ప్రజలందరికీ చాలా థాంక్స్. ఇది వాళ్ల కథ అన్నాడు. మైత్రీ ప్రొడక్షన్స్ వాళ్లకి చాలా పెద్ద థాంక్స్.. ఈ సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. డైరెక్టర్ సుకుమార్‌ని కలిసినప్పుడు.. సార్ నాకు యాక్టింగ్ రాదు… డైలాగ్‌లు రావు అన్నప్పుడు ఏ పర్లేదు నేను నేర్పిస్తా అని చెప్పారు. నాలో కాన్ఫిడెన్స్ నింపింది ఆయనే.

ఇక విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి, హీరోయిన్ క్రితిశెట్టి, మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్, లైట్ మేన్స్‌, జూనియర్ ఆర్టిస్ట్‌లు అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. నాన్ టెక్నికల్, ప్రొడక్షన్ ఇలా అందరి గురించి పేరు పేరున గుర్తుపెట్టుకుని ధన్యవాదాలు తెలిపారు హీరో వైష్ణవ్ తేజ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!