HomeTelugu Trending'ఉప్పెన' ఫస్ట్‌వేవ్‌.. వీడియో

‘ఉప్పెన’ ఫస్ట్‌వేవ్‌.. వీడియో

3 4
టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీలుక్‌, ఫస్ట్‌లుక్‌తో నెటిజన్లను ఆకట్టుకున్న చిత్రబృందం తాజాగా ‘ఉప్పెన’ ఫస్ట్‌ వేవ్‌ను అభిమానులతో పంచుకుంది. ఇందులో కృతిశెట్టిని ఉద్దేశిస్తూ.. ‘బేబమ్మా’ అని పిలుస్తూ కనిపించారు వైష్ణవ్‌ తేజ్‌. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్‌వేవ్‌ను షేర్‌ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌.. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu