వంగవీటి సన్నివేశాలను లీక్ చేసిన వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ రౌడీయిజం నేపధ్యంలో ‘వంగవీటి’ చిత్రాన్ని
రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసంబర్ నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ముందుగా దానికి సంబంధించిన టీజర్ ను,
ట్రైలర్ ను రిలీజ్ చేస్తుంటారు. వాటి ద్వారానే సినిమాకు హైప్ వస్తుంది. అయితే వర్మ మాత్రం
వంగవీటి సినిమాలో కొన్ని షాట్స్ ను విడుదల చేశాడు. సినిమా రిలీజ్ కు ముందే ఇలా కొన్ని
సన్నివేశాలను ప్రేక్షకులకు చూపించి వారిలో సినిమా పట్ల ఆసక్తి కలిగించాలనేది వర్మ ప్లాన్.
నిజ జీవితంలో జరిగిన కథ కావడంతో ఇప్పటికే ‘వంగవీటి’ సినిమాకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది.
వర్మ రిలీజ్ చేసిన సన్నివేశాలతో సినిమాపై క్రేజ్ మరింత పెరగడం ఖాయం. వర్మ తను తీయబోయే
తదుపరి సినిమాలకు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతాడేమో చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates