HomeTelugu Trendingక్రాక్‌ నుండి జయమ్మ ఫస్ట్‌లుక్‌

క్రాక్‌ నుండి జయమ్మ ఫస్ట్‌లుక్‌

3 4
టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’ . ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. నేడు వరలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ‘క్రాక్’ నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మూవీయూనిట్. ఈ సినిమాలో వరలక్ష్మి ‘జయమ్మ’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు చేశారు. ఈ సినిమాలో మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు రవితేజ. ఇటీవల విడుదలైన ‘డిస్కో రాజా’ సినిమా నిరాశపరచడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు మన హీరో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu