వారందరికీ మహేష్ స్పెషల్ గిఫ్ట్స్!

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ హీరోయిన్‌గా ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై టాప్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌లో భాష్యం స్కూల్‌కి చెందిన 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ వారితో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్‌లో పాల్గొన్న 2,500 మంది పిల్లలకు చాక్లెట్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌తో కూడిన బాక్స్‌లను దీపావళి రోజున పంపించారు సూపర్‌స్టార్‌ మహేష్‌. పిల్లలందరూ మహేష్‌తో దిగిన ఫోటోను ఆ బాక్స్‌పై ప్రింట్‌ చేశారు. అలాగే షూటింగ్‌లో పాల్గొన్న పిల్లలందరికీ థాంక్స్‌ చెప్తూ మహేష్‌ స్వయంగా సంతకం చేసిన థాంక్స్‌ కార్డ్‌ కూడా బాక్స్‌ ఓపెన్‌ చేయగానే కనిపించడంతో పిల్లలందరూ చాలా థ్రిల్‌ అయ్యారు. సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని, ఆయన తమకు దీపావళి గిఫ్ట్‌లు ఇవ్వడం మరింత ఆనందాన్ని కలిగించిందని పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates