HomeTelugu Trendingట్రెండ్ అవుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెట్ ఫోటో ..!

ట్రెండ్ అవుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సెట్ ఫోటో ..!

9 16రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతకు ముందు లక్ష్మి పార్వతి, చంద్రబాబుకు సంబంధించిన లుక్స్ ను వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సెట్ ఫోటోను రిలీజ్ చేశాడు. ఇందులో హీరో ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటో అది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాకు ఎలా హైప్ తీసుకురావాలో తెలిసిన వర్మ, ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్నిమాత్రం బయట పెట్టడం లేదు. అతి త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తానని చెప్తున్నాడు వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu