HomeTelugu Trendingపెళ్లి షాపింగ్‌లో ప్రేమ జంట

పెళ్లి షాపింగ్‌లో ప్రేమ జంట

varun tej and lavanya tripa

టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్‌ కూడా స్టార్ట్‌ అయిపోయిందని తెలుస్తుంది. నవంబర్‌ 1న డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. నాలుగు వేల మైళ్ల దూరంలో ఉన్న ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారట.

ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ జంట హైదరాబాద్‌లోని ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా షో రూమ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ జంట పెళ్లి డ్రెస్‌ కోసం షాపింగ్‌కు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌, లావాణ్య ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!