HomeTelugu Trendingవరుణ్‌ తేజ్-లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌

వరుణ్‌ తేజ్-లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌

Varun Tej Lavanya engagemen

నటి లావణ్య త్రిపాఠి మెగా కోడలు కానుంది. మెగా వారసుడు వరుణ్ తేజ్, నటి లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరుగనున్నట్లు వినికిడి.

Varun Tej 1

ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తరువాత అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఇటీవలే పులిమేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు థనల్ అనే తమిళ సినిమా చేస్తుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu