HomeTelugu Trendingబాక్సర్‌గా గద్దలకొండ గణేష్!

బాక్సర్‌గా గద్దలకొండ గణేష్!

3 9

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌.. ముకుందా సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ లా మాస్ ఇమేజ్ తెచ్చుకోవడానికి 9 సినిమాల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ముకుందా తరువాత లోఫర్ అనే మాస్ సినిమా చేసినా కిక్ ఇవ్వలేదు. ఫిదా సినిమా హిట్టయినప్పటికీ సాయి పల్లవి ఖాతాలో ఆ సినిమా వెళ్ళిపోయింది. తన నటనతో ఆకట్టుకుంది హైబ్రిడ్ పిల్ల. తొలిప్రేమ సినిమాతో సోలో హిట్ అందుకున్న వరుణ్ తేజ్.. ఎఫ్ 2 సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.

తెలంగాణ యువకుడిగా యాసతో పేరు తెచ్చుకున్నా.. వెంకీ కామెడీ సినిమాకు ఫుల్ గా వర్కౌట్ అయ్యింది. అయితే, హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ మాస్ హిట్ కొట్టిందని. మాస్ హీరోగా వరుణ్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో.. బాక్సర్ గా నటించేందుకు సిద్ధం అయ్యాడు. అల్లు అరవింద్ సమర్పణలో.. అల్లు వెంకటేష్, సిద్దూ ముద్దాలు నిర్మాతలుగా కొర్రపాటి కిరణ్ దర్శకత్వంలో సినిమా తెరక్కబోతున్నది. వరుణ్ తేజ్ 10 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వరుణ్ తేజ్ బాక్సింగ్ గ్లౌజ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu