‘వాల్మీకి’ హీరోయిన్‌ ఎవరంటే!

‘ఎఫ్ 2’ సినిమా భారీ విజయం తరువాత వరుణ్ తేజ్ తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమా రీమేక్ ‘వాల్మీకి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభమైంది. రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 16 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళమ్మాయిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిర్నాలిని రవి అనే తమిళ హీరోయిన్ ను సెట్ చేశారట. తమిళంలో 2017లో నాగల్ అనే సినిమా చేసింది. డబ్ స్మాష్, టిక్ టిక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది మిర్నాలిని. మెగా కాంపౌండ్ లోకి అడుగుపెడుతుంది కాబట్టి తప్పని సరిగా మెగా హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates