వెంకటేష్‌ ఆ రీమేక్‌ చేయడంలేదు

తమిళంలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘విక్రమ్‌ వేధ’ సినిమా తెలుగు రీమేక్‌లో సినీ నటుడు వెంకటేష్‌ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిలో నిజం లేదని వెంకటేష్‌ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం వెంకటేశ్‌ కేవలం ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారని తెలిపారు. త్వరలో ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చిత్రవర్గాల ద్వారా వెల్లడించారు.

‘వెంకీ మామ’ చిత్రంలో రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లయిన వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌ పాత్రలు పోషిస్తున్నారు. కేఎస్‌ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates