HomeTelugu Trending'మోసగాళ్లు'కి వెంకీ వాయిస్‌

‘మోసగాళ్లు’కి వెంకీ వాయిస్‌

Venkatesh voice for Mosaga
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్లు. ఈ సినిమాలో వీరిద్దరూ అన్న చెల్లిగా నటిస్తున్నారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కెకుతున్నట్లు తెలుస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ – నవదీప్ – నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఈ క్రమంలో హీరో వెంకటేష్ రిలీజ్ చేసిన టైటిల్ కీ థీమ్ మ్యూజిక్.. అల్లు అర్జున్ విడుదల చేసిన టీజర్ కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. మోసగాళ్లు సినిమాకు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ‘మోసగాళ్లు’ కు వెంకటేష్ వాయిస్ ఓవర్ కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుందని మూవీ యూనిట్‌ భావిస్తుంది.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu