HomeTelugu Trendingప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు కన్నుమూత

veteran actor kazan khan pa

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిన్నటి తరం ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ఎమ్ బదూష సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో కజాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళకు చెందిన కజాన్ 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో అమ్మకొడుకు) అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు.

గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర‍్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించారు. మొత్తం 50కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో పవన్ కల్యాణ్ బద్రీ, దివంగత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 2015లో వచ్చిన ‘లైలా ఓ లైలా’ చిత్రంలో వెండి తెరపై కనిపించారు. కజాన్ ఖాన్ మరణం పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu