HomeTelugu Big Storiesమలాలా జీవిత కథ "ఫస్ట్ లుక్"

మలాలా జీవిత కథ “ఫస్ట్ లుక్”

మలాలా ఈ పేరే ఓ సంచలనం. పాకిస్థాన్‌లో తాలిబన్లను ఎదిరించిన సాహస బాలిక మలాలా. తన ప్రాణాలను పణంగా పెట్టి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని పోరాడింది. 11 ఏళ్ల వయసులోనే మలాలా విద్యా హక్కుకోసం పోరాడింది. ఆరేళ్ల క్రితం ఆమెపై ఉగ్రవాదులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సంగతి ప్రపంచానికంతా తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారుల విద్యకోసం మలాలా కృషిచేస్తున్నారు. మలాలా గురించి తెలియని వారు లేరనే చెప్పాలి. ఇప్పుడు ఆమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. హిందీలో “గుల్‌ మకాయ్” పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు అంజద్‌ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలాలా పాత్రలో బాలీవుడ్ నటి రీమ్‌షేక్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్నిఆనంద్‌ కుమార్ నిర్మిస్తున్నారు.

7 3

నోబెల్ శాంతి బహుమతి అందుకున్న యూసఫ్ జాహి మలాలా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఈ సినిమాలో ప్రస్తావిస్తున్నారు. తన చిన్ననాటి అనుభవాలను గుల్ మకాయ్ అనే పేరుతో డైరీ రూపంలో రాసుకున్నారు. అదే పేరుతో సినిమా రూపొందుతోంది. ఉర్దూలో రాసుకున్న ఈ పుస్తకం గురించి బీబీసీలో ఓ కథనం కూడా ప్రచారం చేశారు. మలాలా తన జీవితంలో జరిగిన ఘటనలను ఐయామ్ మలాలా పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. సినిమా థీమ్‌ను తెలియజేసేలా చిత్రం ఫస్ట్‌లుక్‌ను రూపొందించారు. మలాల చేతిలో పుస్తకం పట్టుకొని ఉండగా.. ఉగ్రవాదులు బాంబులతో స్కూలును తగలబెడుతున్నదృశ్యాలను పోస్టర్‌లో చూపించారు. తాలిబన్ల అరాచకాలతో ముస్లిం బాలికలు చదువుకు ఎలా దూరమయ్యారనే విషయాన్ని చూపిస్తున్నట్టుగా ఉంది. ఈ సినిమాలో మ‌లాలా త‌ల్లి పాత్ర‌ను దివ్య ద‌త్తా పోషిస్తుండగా..ఇతర కీలక పాత్రల్లో ఓం పురి, రాగిణి ఖ‌న్నాలు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu