మహేష్‌ ట్వీట్‌ పై మురుగదాస్‌ రీట్వీట్‌

ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సర్కార్‌’ రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. విజయ్‌ సినిమాలు అంటేనే బాక్సాఫీస్‌ షేక్‌ అవుతుంటాయి. విజయ్‌ గత చిత్రం మెర్సల్‌ కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తే. తాజా చిత్రం ‘సర్కార్‌’ వాటిని బ్రేక్‌ చేసేట్టుందని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే సర్కార్‌పై కొంత నెగెటివ్‌ టాక్‌ వచ్చినా వసూళ్లలో మాత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు స్పందించాడు. ‘ఇది ఏఆర్‌ మురుగుదాస్‌ ట్రేడ్‌మార్క్‌ చిత్రం. ఈ పొలిటికల్‌ డ్రామాను ఎంజాయ్‌ చేశాను. చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. మహేష్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘ సర్‌ థ్యాంక్యూ.. సో మచ్‌. మీకు ఈ చిత్రం నచ్చినందుకు సంతోషం. ఇది నాకు చాలా పెద్ద విషయం’ అంటూ బదులిచ్చాడు మురుగదాస్.