HomeTelugu Big StoriesFamily Star: నాకు కొత్తగా బ్రేక్‌లు ఇవ్వొద్దు.. ఉన్నదానిని చెడగొట్టకు

Family Star: నాకు కొత్తగా బ్రేక్‌లు ఇవ్వొద్దు.. ఉన్నదానిని చెడగొట్టకు

Family Star Trailer

Family Star Trailer: హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ- ప‌ర‌శురామ్ డైరెక్షన్‌లో వస్తున్న తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏప్రిల్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ ట్రైల‌ర్‌ విడుదలైంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్, కామెడీ అంశాల‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. స్వామి…కొత్త‌గా నాకు లైఫ్‌లో బ్రేక్‌లు ఇవ్వాల్సిన ప‌నిలేదు. ఉన్న‌దానిని మాత్రం చెడ‌గొట్ట‌కు అనే విజ‌య్ దేవ‌ర‌కొండ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ట్రైల‌ర్‌లో ట్రెండీ లుక్‌లో మృణాల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రెండ్‌షిప్‌లు, తిర‌గ‌డాలు బంద్‌. హీరోయిన్‌ ఇంటికి రావ‌డానికి వీలులేదు. మీరు పైకి వెళ్ల‌డానికి వీలు లేదు అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ఒట్టు వేయించుకోవ‌డం న‌వ్విస్తోంది.

నేనైతే మీకు ఫుల్లుగా ప‌డిపోయాంటూ మృణాల్ ఠాకూర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చెప్పే రొమాంటిక్ డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. బుర్ర బ‌ద్ద‌లైపోతుద్ది కొడ‌కా…భ‌య‌ప‌డాలిరా ఇంకోసారి ఎవ‌రైన చుల‌క‌న‌గా మాట్లాడాలంటే అంటూ విల‌న్స్‌కు విజయ్‌ ఇచ్చే మాస్‌ వార్నింగ్ ఇచ్చే సీన్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. కోపం ఎగిరిపోతుంద‌టే న‌న్ను కొట్ట‌వే బాబు అంటూ ట్రైల‌ర్ చివ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌గానే మృణాల్ అత‌డి చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టి కొట్ట‌డంతో ట్రైలర్‌ కంప్లీట్‌ అవుతుంది.

మిడిల్ క్లాస్ కుర్రాడిగా స్టైలిష్‌గా క‌నిపిస్తూనే త‌న కామెడీతో ఫ్యాన్స్‌ను న‌వ్వించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్‌, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ఈ ట్రైల‌ర్ ట్రెండింగ్‌గా మారింది. ఈ మూవీకి గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. విజయ్‌ దేవరకొండకు మరోహిట్‌ పడేలాన అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మృణీల్‌ ఠాకూర్‌ ప్లస్‌ అనే చెప్పాలి. ఆమె ఇప్పటి వరకూ నటించిన సినిమాలు అన్నీ కూడా మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. గతంలో విజయ్‌- ప‌ర‌శురామ్ కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈముగురి కాంబినేషన్‌ వర్కౌట్‌ అవుతుంది అని చెప్పావచ్చు. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu