HomeTelugu Trendingరాజమౌళికి కరోనా.. వ్యంగ్యంగా స్పందించిన ఆర్జీవీ

రాజమౌళికి కరోనా.. వ్యంగ్యంగా స్పందించిన ఆర్జీవీ

RGV tweet on rajamouli whoదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. గత రాత్రి ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన ఫ్యామీలి మొత్తం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే విషయం తెలిసిన వెంటనే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఏమీ కాదని, హ్యాపీగా ఉండాలని సూచించారు. ప్రతి రోజూ ఓ గుడ్డు తింటే త్వరగా కోలుకోవచ్చని చెప్పారు. కాగా, గణేశ్ కూడా ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సూచనలు చేశారు. తాజాగా, వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. మీరు, మీ కుటుంబ సభ్యులు త్వరలోనే కోలుకుంటారన్నాను. అంతకంటే ముందు రాజమౌళి సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి అంటూ వర్మ రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu