HomeTelugu Trendingఅల్లు అర్జున్‌కు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ..

అల్లు అర్జున్‌కు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ..

2 9

టాలీవుడ్‌ రౌడీ హీరో.. విజయ్‌ దేవరకొండ.. స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌కు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ను పంపించారు. ‘రౌడీ’ బ్రాండ్‌ పేరుతో విజయ్‌ దేవరకొండ వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్‌ ఓ సందర్భంలో బన్నీకి ‘రౌడీ’ బ్రాండ్‌ బట్టలను గిఫ్ట్‌గా పంపిస్తానని మాటిచ్చారట. ఈ మేరకు బన్నీ కోసం ప్రత్యేకంగా టీషర్ట్స్‌ డిజైన్‌ చేసి పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లుఅర్జున్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా విజయ్‌ దేవరకొండకు ధనవ్యాదాలు చెప్పారు. ‘బన్నీ అన్న.. ‘అల..వైకుంఠపురములో..’ చిత్రానికి గుడ్‌లక్‌. మాటిచ్చినట్లుగానే మీకోసం ప్రత్యేకంగా ఈ దుస్తులను నేనే డిజైన్‌ చేశాను.’ అని విజయ్‌ దేవరకొండ దుస్తులతో పంపించిన ఓ లెటర్‌లో పేర్కొన్నారు.

విజయ్‌ దేవరకొండ పంపించిన గిఫ్ట్‌కు ఎంతో సంతోషించిన అల్లు అర్జున్‌.. ‘మై డియర్‌ బ్రదర్‌ విజయ్‌ దేవరకొండ థ్యాంక్యూ. మాటిచ్చినట్టుగానే నాకోసం ‘రౌడీ’ బ్రాండ్‌ దుస్తులను పంపించావ్‌. ‘అల..వైకుంఠపురములో..’ సెలబ్రేషన్స్‌ సమయంలో వీటిని తప్పకుండా ధరిస్తాను.’ అని బన్నీ తెలిపారు.

ప్రస్తుతం బన్నీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల..వైకుంఠపురములో..’ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu