HomeTelugu Big Storiesవిజయ్‌ దేవరకొండ న్యూలుక్‌.. షాక్‌లో నెటిజన్లు..

విజయ్‌ దేవరకొండ న్యూలుక్‌.. షాక్‌లో నెటిజన్లు..

5a 5
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ న్యూలుక్‌ కనిపించాడు. తన తండ్రి గోవర్ధన్ రావుతో, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ దేవరకొండ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేస్తున్నాయి. ఆయన లుక్ చూసిన నెటిజన్స్.. ఆశ్చర్యపోతున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ తన కొత్త లుక్‌లో తండ్రితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు విజయ్ దేవరకొండ.

”నేను తీసుకునే నిర్ణయాలు, చేసే తప్పులు, నష్టాలు, సాహసాలు అన్నింటా ఆయనే ముందుంటారు. ది ఫస్ట్ దేవరకొండ.. హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ” అని పేర్కొంటూ తండ్రి పక్కనే తాను హ్యాపీ మూమెంట్‌లో కూర్చున్న పిక్ పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఫొటోలో విజయ్ ఫ్రెంచ్ కట్ లుక్‌లో డిఫరెంట్‌గా కనిపించడంతో అంతా షాకయ్యారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కొత్త సినిమా ‘ఫైటర్’ కోసమే ఈ లుక్ లోకి వచ్చారా? లేదా మరో సినిమా కోసమా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విజయ్‌ న్యూలుక్‌ వైరల్‌ అవుతోంది.

5 19

Recent Articles English

Gallery

Recent Articles Telugu