HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండతో రష్మిక .. సినిమా కోసం కాదంట!

విజయ్‌ దేవరకొండతో రష్మిక .. సినిమా కోసం కాదంట!

Vijay Deverakonda To Romancటాలీవుడ్ లోకి ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఈ తరువాత ఈ బ్యూటీ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని సమాచారం.

కాగా ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో.. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. ఒకటి మంచి విజయాన్ని సాధించగా మరొకటి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే అదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడిచిందని రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ జోడీ మరోసారి కలిసి నటించబోతున్నారట. కాకపోతే ఈసారి సినిమాలో కాకుండా ఓ యాడ్ కోసం కలుస్తున్నారట. ఒక దుస్తుల బ్రాండ్ యాడ్ కోసం విజయ్ తో కలిసి రష్మిక నటిస్తోందట. అయితే ఈ బ్రాండ్ కి ఈ బ్యూటీని విజయ్‌ దేవరకొండనే సిఫార్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu